calender_icon.png 20 September, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహన ఫార్మసీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

20-09-2025 08:32:02 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం యల్ యం డి క్యాంపస్ లో గల ఫార్మసీ కళాశాలలో శనివారం రోజున ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా కే సునీత మాట్లాడుతూ తెలంగాణా ఆత్మగౌరవం, బతుకమ్మ సంబురాల ప్రాధాన్యత, సంస్కృతీని, మహిళల అంకిత భావాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ డా కే శ్రీశైలం, విభాగాధిపతి జి యల్ అర్చన, డా బి భాగ్యలక్ష్మి, డా సీహెచ్ అనిల్ కుమార్, డా ఏ శ్రీనివాస్ నాయక్ డా పి క్రాంతి రాజు, జే అశ్విని, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.