calender_icon.png 10 January, 2026 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ సదస్సులో అనురాగ్ యూనివర్సిటీ అధ్యాపకుల పరిశోధన పత్రం ప్రదర్శన

10-01-2026 12:29:37 AM

ఘట్‌కేసర్, జనవరి 9 (విజయక్రాంతి) : ఐసిటిఐఈఈ 2026 అంతర్జాతీయ సదస్సులో అనురాగ్ యూనివర్సిటీ అధ్యాపకుల పరిశోధన పత్రం ప్రదర్శించారు. అనురాగ్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహీపతి శ్రీనివాస రావు, ఇంజనీరింగ్ ఆనందం సామాజిక ముగింపు మాడ్యూల్ ప్రభావం మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల్లో అనుభవాత్మక అభ్యాసం నైపుణ్యాభివృద్ధి అనే శీర్షికతో తమ పరిశోధన పత్రాన్ని అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించారు.

ఈ ప్రతిష్టాత్మక 13వ అంతర్జాతీయ ఇంజనీరింగ్ విద్యలో మార్పులపై సదస్సు జనవరి 7 నుండి 10, 2026 వరకు నిర్వహించబడింది. ఈ సదస్సు ఏఐ ఆధారిత ప్రపంచంలో బోధనఅభ్యాస వ్యవస్థల రూపాంతరం అనే ప్రధాన అంశంపై కేంద్రీకృతమైంది. ఈసదస్సును ఇండో యూనివర్సల్ కాలాబొరేషన్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రముఖ విద్యా పరిశ్రమ భాగస్వాములతో కలిసి నిర్వహించింది.

ఈపరిశోధన పత్రం ద్వారా సామాజిక మునిగింపు మాడ్యూల్ విద్యార్థుల్లో అనుభవాత్మక అభ్యాసం, సమస్య పరిష్కార సామర్థ్యం, బృందపనితనం, సామాజిక బాధ్యత నైపుణ్యాభివృద్ధిని ఎలా పెంపొందిస్తుందో విశ్లేషించ బడింది.

వాస్తవ జీవిత సామాజిక అనుభవాలతో కూడిన ఈ వినూత్న బోధనా విధానం, ఫలితాల ఆధారిత విద్యా విధానంతో అనుసంధానమై ఉండటం వల్ల, ఈ పరిశోధనకు సదస్సు లో పాల్గొన్న విద్యావేత్తలు మరియు పరిశోధకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపొందించేందుకు మరియు పరిశోధన ఆధారిత బోధనను ప్రోత్సహించేందుకు అనురాగ్ యూనివర్సిటీ జాతీయ, అంతర్జాతీయ విద్యా వేదికలలో నిరంతరం సక్రియంగా పాల్గొంటూ ముందుకు సాగుతోంది.