calender_icon.png 10 January, 2026 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలవులతో బస్సులు కిటకిట

10-01-2026 12:29:54 AM

ఆధార్‌తో కండక్టర్లకు కటకట

 బెజ్జూర్, జనవరి 9, (విజయ క్రాంతి ): ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్, సిర్పూర్ టి, కౌటాల, బెజ్జూర్ మండలాలలో బస్సుల కోసం ప్రయాణికులు పడ్డారు. ఒకవైపు సంక్రాంతి సెలవులు కావడంతో, మరోవైపు సర్వీసులు తక్కువగా నడపడంతో బస్సులు రాక ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితిగా నెలకొంది. వచ్చిన ఒకే బస్సులో పరిమితికి మించి ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితిగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.

బస్సులో పరిమితికి మించి ప్రయాణి కులు ప్రయాణించడంతో కండక్టర్లకు ఆధార్ తలనొప్పిగా మారింది. బస్సు లు కిటకిటగా  ఉండడంతో కండక్టర్ టికెట్ ఇవ్వాలని పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రకు వెళ్లాల్సిన లహరి బస్సు రెండు సమయాల్లో కూడా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు స్పందించి సమయపాలనతో బస్సులు నడపేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.