calender_icon.png 10 January, 2026 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

11-01-2026 12:00:00 AM

మేడ్చల్ అర్బన్ జనవరి 9 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అత్వెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటేరియల్ పంపిణీ చేయడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు గడప నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్కాజిగిరి జిల్లాలోని దినదయాల్‌నగర్‌లో గల సెయింట్ మారక్స్ గ్రామర్ హైస్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జున రావు అత్వెల్లి పాఠశాలలో చదువుతున్నటువంటి1l0 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మేటేరియల్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో అత్వెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్న వారికి ఉపాధ్యాయులు గడప నవీన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాణిక్యాలరావు మాట్లాడుతూ స్టడీ మెటీరియల్ ఉపయోగించుకునే విద్యార్థిని విద్యార్థులు సమయాన్ని వినియోగం చేసుకొని పదవ తరగతిలో అత్యున్నతమైన ర్యాంక్ లను సాధించాలని ఆయన సూచించారు.

అత్వెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్టడీ మెటెరియల్ పంపిణీ చేయగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మలత, మంజుల, విజయలక్ష్మి, స్వరూప రాణి, రీతు, సోనీలతో పాటు ఉపాధ్యాయులు రంగారావు, రాంబాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.