calender_icon.png 18 September, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బిల్డింగ్‌కు రూ.35 కోట్లు

18-09-2025 12:25:44 AM

నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బిల్డింగ్‌లో నిర్మాణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బుధవారం సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బిల్డింగ్‌లో నాలుగో అంతస్తు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.