18-09-2025 12:25:22 AM
- డీసీసి అధ్యక్షులు జి.మధుసుధన్ రెడ్డి
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ పాలనను అంతమొందించి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 సందర్భంగా బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్రం రాక నిజాం పాలనలో మగ్గిపోతున్న సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నిజాం పాలనపై, రజాకర్ల దురాగతాలపై సైనిక చర్యగా జరిపి యుద్ధంలో నిజాం ను ఓడించి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నా యకత్వంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ , అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్, ఎన్ పీ వెంకటేశ్, అన్వర్ పాష, డిసిసి మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు సి రాజ్ ఖాద్రీ, గోపాల్ యాదవ్, సాయిబాబా, నయుమ్, అజ్మత్‌అలీ, చంద్ర శేఖర్, సంజీవ్ రెడ్డి, వేణు, మహమూద్, జగదీష్, అవేజ్ అహ్మెద్, వెంకట లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.