calender_icon.png 18 September, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంతెన ఇరువైపులా బీటీ రోడ్డు వేయించాలని వినతి

18-09-2025 12:26:30 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణంలో ఇరువైపులో ఉన్న రోడ్డును ఆర్టీసీ బస్సులు పోవడానికి వీలుగా బీటీ రోడ్డు వేయించి ప్రజల కష్టాలను దూరం చేయాలని కోరుతూ బుధవారం ఘట్ కేసర్  మున్సిపల్ జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ లిమిటెడ్ డివిజనల్ ఇంజనీర్ అరవింద్ ని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేసి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా  స్పందించి అతి త్వరలో బీటీ రోడ్డు వేయిస్తామని తెలియజేశారు.

ఈసందర్భంగా కమిటీ వారు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఘట్ కేసర్ మున్సిపల్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, జేఏసీ సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా, అల్లు కమలాకర్, ఎండి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.