21-07-2024 06:06:22 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసగించనున్నారు. ఏపీ అసెంబ్లీలో మరోసారి ప్రతిపక్ష నేత హోదా తెరపైకి రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. 11 సీట్లే వచ్చాయి కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం తేల్చిచెప్పింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీలో ఇప్పటివరకు సీట్ల కేటాయింపు జరపలేదు. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారానున్నాయి.రేపు ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని పార్టీ నాయకులకు టీడీఎల్పీ సూచించింది.