calender_icon.png 4 December, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవదాన్ హైస్కూల్‌లో దారుణం

04-12-2025 08:27:02 PM

విద్యార్థిని ఇష్టరీతిన కొట్టిన ప్రిన్సిపల్..

క్లాస్ లో ఫస్ట్  చదువుతున్న విద్యార్థికి తప్పని దెబ్బలు..

ప్రిన్సిపాల్ మానసిక పరిస్థితిపై ఆందోళనలో తల్లిదండ్రులు..

కామారెడ్డి (విజయక్రాంతి):​ పిల్లలకు విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కర్కశంగా వ్యవహరించాడు. కామారెడ్డిలోని జీవదాన్ హై స్కూల్లో గురువారం దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిన్నీ ఒక ఉపాధ్యాయుడు ఇష్టరీతిన కొట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ సంఘటన జీవధాన్ హైస్కూల్లో చోటుచేసుకుంది. ​జీవదాన్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు(ప్రధాన ప్రిన్సిపల్) చిన్న కారణంపై ముగ్గురు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు.

బాధితుల పిల్లల తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్ ప్రిన్సిపల్ దాదాపు ఉదయం 11:30 నిమిషాలకు పిల్లవాడిని గదిలోకి తీసుకెళ్లి కర్రతో కొట్టారని తెలుస్తోంది. దీంతో విద్యార్థి శరీరంపై గాయాలు అయ్యాయి. విద్యార్థి భయంతో వణికిపోయాడు. పేరెంట్స్ కు కూడా ఫోన్ చేయవద్దు అని బెదిరించారని సమాచారం. కొట్టిన దెబ్బలకు నొప్పి తట్టుకోలేక, భయంతో ఇంటికి వచ్చిన విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డను అకారణంగా కొట్టినందుకు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ​తల్లిదండ్రులు వెంటనే విద్యార్థిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఉపాధ్యాయుడిపై, స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి, వారిపై చేయి చేసుకునే ఉపాధ్యాయులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అటువంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని.. గతంలో కూడా తమ కుమారుడిని కొట్టారని, చదువు రాకున్నా పర్వాలేదు కానీ మా కుమారుని ఇంత ఘోరంగా కొట్టవద్దని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్టు విద్యార్థి తల్లిదండ్రులు  చెప్తున్నారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.​ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.