జాతీయ టీచర్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
29-06-2024 12:05 AM
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్ అవార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి 2024 సంవత్సరానికిగానూ కేంద్ర విద్యాశాఖ ఈ దరఖాస్తులను స్వీకరిస్తోంది. జూలై 15లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది.




