1 July, 2026 | 11:37 AM

ఓపెన్ యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా సుధారాణి

29-06-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొ.సుధారాణి బాధ్యతలు స్వీకరించారు. ప్రొ.సుధారాణి విశ్వవిద్యాల యంలో చరిత్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించడం తో పాటుగా.. జీఆర్‌సీఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన సుధారాణికి అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.