calender_icon.png 25 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులు

25-09-2025 12:00:00 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): 2025 - 26 విద్యా సంవత్సరానికిగాను విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్య ను అభ్యసించేందుకు షెడ్యూల్ కులాల అభివృ ద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సం చాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ బుధ వారం తెలిపారు.

యుఎస్‌ఎ, యుకె, ఆస్ట్రేలియా, కెన డా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరి యా, న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సులలో చదవాలనుకునే షెడ్యూల్ కులాల విద్యార్థులకు నవంబర్ 19లోగా ఆన్‌లైన్‌లో (www. telangana.epass.cgg. gov. in) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థులు జిల్లాకు చెందిన షెడ్యూల్ కులముల వారై ఉండాలని, వార్షిక ఆదా యం రూ. 5 లక్షలలోపు ఉండాలని, పిజి చదవడానికి గ్రాడ్యుయేషన్ లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలన్నారు. ఒక కుటుం బం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ పథకానికి అర్హులని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.