25-09-2025 12:23:42 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): చిన్ననాటి నుంచే సెపక్తక్రా ఆటగాళ్లలో ఒకరుగా ఎదిగారు నవత. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న ఆమె.. 2024 ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే లక్ష్యం తో గోవాలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. శిక్షణ సమయంలో మోకాలికి తీవ్ర గాయం ఏర్పడింది. ఆ గాయాన్ని అధిగమించి, మళ్లీ తిరిగి బరిలోకి దిగి ఈసారి జాతీయ స్థాయి లో రజత పతకాన్ని గెలుచుకున్నారు.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థ్రోస్కోపి, జాయింట్ రీప్లేస్మెంట్ మరియు స్పోరట్స్ సర్జన్ డాక్టర్ హరిప్రకాష్ ఆమె చికిత్స గురించి వివరించారు. “నవత తమ ను సంప్రదించగా పరీక్షల తర్వాత ఆమెకి ఉన్న గాయం పూర్తిగా నాశనమైన ఏసీఎల్ (యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్) అని నిర్ధారించాం.
ఇది మోకాలిలో ప్రధాన లిగమెంట్లలో ఒకటి. గాయం తీవ్రంగా ఉం డటంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిం ది. మొదట వాపు తగ్గేందుకు రెండు వారాల పాటు వేచి ఉన్నాం. అనంతరం ఆమె తన మోకాలిలో ఉండే మరో లిగమెం ట్ను తీసుకుని మళ్లీ అమర్చాం. ఫిజియోథెరపీ తర్వాత ఆమె పూర్తిగా కోలుకుని తిరిగి ఆటను ప్రారంభించారు. అంతకుమించి, జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఆనందదాయకం” అన్నారు.
తిరిగి ఆడుతానని అనుకోలేదు: నవత
ఆసియా క్రీడల్లో ఆడే అవకాశానికి చాలా ఉత్సాహంగా గోవాలో శిక్షణలో పాల్గొన్నాను. కానీ అక్కడ మోకాలికి గాయం కావ డంతో ఎంతో షాక్కి లోనయ్యాను. వెంటనే బెస్ట్ స్పోరట్స్ సర్జన్ ఎవరో ఇంటర్నెట్‌లో వెతికాను. అప్పుడే కిమ్స్ డాక్టర్ హరిప్రకాష్ పేరును చూశాను. మా సొంత ఊరు ఇక్కడే కావడంతో వెంటనే ఆస్పత్రికి వచ్చి చూపించుకొని శస్త్రచికిత్స చేయించుకున్నాను.
ఆ తర్వాత ముంబైలో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం రావడంతో ఫిజియోథెరపీకి ఎక్కు వ సెలవులు తీసుకోలేకపోయాను. అందువల్ల కోలుకోవడానికి సుమారు 810 నెలలు పట్టింది. తర్వాత నెమ్మదిగా తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 2024 అక్టోబర్, నవంబర్ నెలల నుంచి తిరిగి శిక్షణ కొనసాగించాను.