calender_icon.png 9 February, 2026 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

09-02-2026 02:21:05 AM

రూ.10 వేలు లేట్ ఫీజుతో మే 12 వరకు గడువు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులకు బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సం వత్సరంలో ప్రవేశాలు కల్పించే టీజీ ఈసెట్ దరఖాస్తులు నేటి నుంచి స్వీకరించనున్నారు.

ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువిచ్చారు. రూ.10 వేల అపరాధ రుసుంతో మే 12 వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. పరీక్షను మే 15న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.