09-02-2026 02:22:20 AM
12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మిర్యాల ప్రభావతి
కల్వకుర్తి, ఫిబ్రవరి 8: హస్తం గుర్తు అన్ని వర్గాల ప్రజలకు అభయహస్తంగా నిలుస్తుందని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మిర్యాల ప్రభావతి అన్నారు. వార్డులోని ప్రజల ఆశీర్వాదాలతో అభివృద్ధి ధ్యేయంగా ప్రజల్లోకి వచ్చానని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఆదివారం ఎన్ని కల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటర్లను కలిసి మాట్లాడుతూ, కాలనీలో ఉన్న సమస్యలన్నిటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ల సహకారంతో 12వ వార్డును సమస్యల రహితంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ప్రత్యేక నిధు లు మంజూరు చేయించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, పుస్తకాల రాహుల్, ముత్యాల రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.