calender_icon.png 10 October, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం షాపుల లైసెన్స్ పొందేందుకు దరఖాస్తుల స్వీకరణ

09-10-2025 12:23:31 AM

మలక్‌పేట్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): చార్మినార్ ప్రొహిబిషన్,  ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2025 సంవత్సరానికి మద్యం షాపుల నిర్వహణకు లైసెన్స్ పొందడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చార్మినార్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. రిటైల్ మద్యం షాపుల నిర్వహణకు కొత్త లైసెన్సులను పొందడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వారు ఎవరైనా ఆసక్తి కలవారు మూడు లక్షల రూపాయలు (నాన్ రిఫండబుల్) చెల్లించి ఈ నెల18 వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. షాపు కేటా యింపు పొందిన వారికి లైసెన్సు రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుందన్నారు.

మద్యం దుకాణా ల కోసం తమ దరఖాస్తులను సంబంధిత డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్, కమీషనర్ ఆఫ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్,  కార్యాలయా ల్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన మద్యం దుకాణాల దరఖాస్తులు నాంపల్లిలోని అబ్కారీ భవన్ లో నాలుగో అంతస్తులో స్వీకరించబడతాయని వివరించారు.