13-10-2025 01:46:22 AM
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటి వరకు 5,663 వచ్చాయని, ఇంకా వారం రోజులే (ఈనెల 18) గడువు ఉండడంతో చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 2,353, అత్యల్ఫంగా అదిలాబాద్ జిల్లా నుంచి 142 దరఖాస్తులు వచ్చాయి.
తెలంగాణలోని 2,620 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం నాటికి తెలంగాణలో 5,663 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మద్యం షాపులకు రెండేళ్లకోసారి దరఖాస్తులను ఎక్సుజ్ శాఖ ఆహ్వానిస్తుంది. రెండేళ్ల క్రితం కూడా చివరి రెండు రోజుల్లో 45 వేల నుంచి 50వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు కూడా చివరి మూడు రోజుల్లో దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ఎక్సుజ్ డివిజన్ల వారీగా, రంగారెడి, హైదరాబాద్ డివిజన్లలోనూ, ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యాలూ కలగకుండా ఎక్సుజ్ కమిషనర్ సి.హరికిరణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం మద్యం షాపులకు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి కూడా ఏపీ, కర్ణాటక, మహారాష్ర్ట ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వేయడానికి మద్యం వ్యాపారులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సుజ్ శాఖ అధికారులు గుర్తించారు.
మరోపక్క మద్యం షాపులకు కేటాయించిన రిజర్వేషన్ల మేరకు గౌడ్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గౌడ షాపులకు 671 దరఖాస్తులు, ఎస్సీ రిజర్వేషన్లు 202, ఎస్టీ రిజర్వేషన్లు 84, జనరల్‌లో 4,686 దరఖాస్తులు వచ్చాయి. ఇదే రీతిలో ఉమ్మడి జిల్లాల వారీగా ఈ కింది విధంగా దరఖాస్తులు వచ్చాయని దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.