calender_icon.png 13 October, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి ఏఐజీలో ఉద్రిక్తత

13-10-2025 01:33:11 AM

-కాలేయ మార్పిడి చికిత్స పొందుతూ మురళీధర్ అనే వ్యక్తి మృతి 

-వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించాడని కుటుంబ సభ్యుల ఆరోపణ 

-45 రోజుల చికిత్సకు రూ.85 లక్షలు వసూలు చేశారని ఆవేదన 

-జీవన్‌దాన్‌లో వయసు తప్పుగా నమోదు చేయడం వల్లే సమస్యలు వచ్చాయని ఆరోపణ 

-రూ.14 లక్షలు కట్టించుకున్నాకే మరణవార్త చెప్పారని బంధువుల కన్నీరు

శేరిలింగంపల్లి,అక్టోబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అచ్చం ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేయాలంటూ బాధితుల నుంచి లక్షలు గుంజి ఆ తర్వా త చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. భారీగా డబ్బులు వసూలు చేసి, చివ రికి ప్రాణాలు తీశారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే, కుత్బుల్లాపూర్కు చెందిన మురళీధర్ (40) కొంతకా లంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం 45 రోజుల క్రితం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు చెప్పడంతో, అవయవదానం కోసం జీవన్దాన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ము రళీధర్ వయసు 40 ఏళ్లు కాగా, ఆస్పత్రి సిబ్బంది పొరపాటున 60 ఏళ్లుగా నమోదు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ తప్పిదం వల్ల అవయవదాతలు ఎవరూ ముందుకు రాలేదని, దీంతో చివరికి అతని భార్యే కాలేయాన్ని దానం చేసేందుకు ముం దుకొచ్చారని వారు తెలిపారు.

ఈ 45 రోజుల చికిత్స కోసం తాము సుమారు రూ. 85 లక్షలు చెల్లించామని, ఉన్న ఒక్క ఇంటిని అమ్మి డబ్బు కట్టామని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, శని వారం మరో రూ.14 లక్షలు చెల్లించిన తర్వా తే మురళీధర్ మృతి చెందినట్లు ఆస్ప త్రి యాజమాన్యం తెలిపిందని కుటుంబ సభ్యు లు కన్నీరుమున్నీరయ్యారు. డబ్బు కట్టించుకున్న తర్వాత మరణవార్త చెప్పడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైద్యుల నిర్ల క్ష్యం, జీవన్దాన్లో తప్పుడు సమాచారం నమో దు చేయడం వల్లే మురళీధర్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యు లు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న రాయ దుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితి ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మానవతావాది

హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డి గొప్ప మానవతావాది. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపు పొందిన ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. అధునాతన ఎండోస్కోపిక్ విధానాలకు మార్గదర్శకత్వం వహించడం,మారుమూల ప్రాంతాలకు రోగ నిర్ధారణలను తీసుకురావడానికి మొబైల్ ఎండోస్కోపీ యూనిట్లను ప్రారంభించడం తో ఆయన మానవతా ప్రయత్నాలు నిదర్శనంగా ఉన్నాయి.

నాగేశ్వర్‌రెడ్డి సాధించిన విజయాలకు అనేక సంఘాలు ఆయన్ని గుర్తించాయి. కేంద్రం నుంచి  పద్మ శ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు సైతం అందుకున్నారు. పేదలకు తక్కువ ఫీజుతో వైద్య సేవలందించారు.ఆదివారం జరిగిన ఘటనలో ప్రా ణాలు కోల్పోయిన మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరుతున్నారు.