calender_icon.png 13 October, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఐకి బీజేపీ తూట్లు

13-10-2025 01:47:57 AM

  1. విజిల్ బ్లోవర్లకు రక్షణ కల్పించాలి
  2. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  ఆరోపించారు. 2019లో చేసిన సవరణల ద్వారా సమాచారం కమిషన్ల స్వతంత్రతను తొలగించి, పదవీకాలం, సేవా షరతులను కేంద్రం ఆధీనంలోకి తీసుకొచ్చిందని తెలిపారు.

అదేవిధంగా 2023లో తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ద్వారా ప్రజాప్రయోజన సమాచారాన్ని కూడా మినహాయింపుగా మార్చి, పారదర్శకతను దెబ్బతీసిందని అన్నారు. స్వయం ప్రతిపత్తితో నిర్వహించే ఆర్టీఐ కమిషనర్లు కేంద్రం ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్టీఐ అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

కేంద్ర సమాచారం కమిషన్ ప్రస్తుతం 11 పోస్టులకు బదులుగా కేవలం 2 కమిషనర్లతోనే పనిచేస్తోందని తెలిపారు. 2025 సెప్టెం బర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంటుందని, ఇంతకంటే దు ర్మార్గం లేదని మండిపడ్డారు. డీపీడీపీ చట్టంలోని సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచే సెక్షన్ 44(3) సవరణలను పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.

2019 సవరణలను రద్దు చేసి కమిషన్ల స్వతంత్రతను పునరుద్ధరించాలని కాం గ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. యూపీ ఏ ప్రభు త్వం అమలు చేసిన ఆర్టీఐ, నరేగా, అటవీహక్కులు, విద్యాహక్కు, ఆహార భద్రత చట్టాల ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు. ఆర్టీఐ చట్టం పేద, అణగారిన వర్గాలకు జీవనరేఖగా మారి, సరుకుల పంపిణీ, పెన్షన్లు, బకాయిలు, స్కాలర్‌షిప్‌ల వంటి హక్కులను సా ధించుకునే శక్తిని ప్రజలకు ఇచ్చిందని చెప్పారు.

భోపాల్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త షెహ్లా మసూద్ అక్రమ మైనింగ్ బహిర్గతం చేస్తూ ఉండగా ఇంటి వద్దే కాల్చివేతకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఆర్టీఐ యాక్టివిస్టుల్లో భ యాన్ని పెంచాయన్నారు. విజిల్ బ్లోవర్స్ ప్రొ టెక్షన్ చట్టం యూపీఏ ప్రభు త్వం ప్రవేశపెట్టి, పార్లమెంట్ ఆమోదించినప్పటికీ 2014 నుం చి ఇప్పటి వరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ర్ట కమిషన్లలో ఖాళీలను తక్షణమే పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీఐ వినియోగదారులు, విజిల్ బ్లోవర్లకు బలమైన రక్షణ కల్పించాలన్నారు. కమిషన్లలో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు తదితర విభిన్న వర్గాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలన్నారు. చట్టాలను కాపాడు కోవడానికి పౌరులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.