calender_icon.png 13 October, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'జూబ్లీ' ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా చాటుతాం

12-10-2025 11:20:04 PM

నిరుద్యోగుల జేఏసీ నాయకురాలు అస్మా..

ఎల్బీనగర్: నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిరుద్యోగుల సత్తా చూపిస్తామని నిరుద్యోగుల జేఏసీ నాయకురాలు అస్మా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తమ లక్ష్యం అస్మా స్పష్టం చేశారు. సరూర్‌నగర్‌లోని వీవీనగర్ వద్ద ఆదివారం రాత్రి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్దఎత్తున హాజరై, బీ ఫామ్ అందజేస్తూ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను అమలు చేయకూ యువతను మోసం చేసిందన్నారు.

నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత, నోటిఫికేషన్లు విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించే జీవోలను జారీ చేసి, వేలాది నిరుద్యోగులను రోడ్డున పడేశారని విమర్శించారు‌. తమను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులు ఐక్యంగా నిలిచి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ బలాన్ని చాటేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న ఈ సందర్భంగా నిరుద్యోగులు జేఏసీ నాయకురాలు అస్మా నామినేషన్ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. "జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే మా సవాల్,” అని అస్మా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.