18-10-2025 12:00:00 AM
ఇప్పటి వరకు 655 దరఖాస్తులు నమోదు
మంచిర్యాల, అక్టోబర్ 17 : మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడుతు న్నారు. 2025-27 సంవత్సరానికి కొత్త మద్యం పాలసీ ప్రకారం టెండర్లు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యాయి. మొదట ఆచితూచీ టెండర్లు దాఖలైన గడిచిన రెండు రోజుల నుంచి వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గురువారం 83 దరఖాస్తులు రాగా, శుక్రవారం ఒక్క రోజే 433 దరఖాస్తులు వచ్చాయి.
ఇప్పటి వరకు మొత్తం 655 ( మంచిర్యాల ఎక్సైజ్ సర్కిల్‌లో 263, బెల్లంపల్లిలో 185, లక్షెట్టిపేటలో 109, చెన్నూర్ సర్కిల్ పరిధిలోని దుకాణాలకు 98) దరఖాస్తులు దాఖలయ్యా యి. జిల్లాలో 73 మద్యం దుకాణాలకు గాను ఎస్సీలకు పది, ఎస్టీలకు ఆరు, గౌడ కులస్తులకు ఆరు, ఓపెన్ గా 51 దుకాణాలను కేటాయించారు. కాగా ఇందులో రిజర్వుడ్ దుకాణాలపై వ్యాపారులు కన్ను వేశారు.
రిజర్వేషన్ల వారిగా వచ్చిన దరఖాస్తులు..
జిల్లాలోని 73 ఏ4 మద్యం దుకాణాలలో ఎస్సీలకు 10 దుకాణాలు కేటాయించగా ఇప్పటి వరకు 62 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఎస్టీలకు ఆరు దుకాణాలు కేటాయిం చగా 18 దరఖాస్తులు రాగా, గౌడ్స్ లకు ఆరు దుకాణాలు రిజర్వ్ చేయ గా 28 దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ కేటగిరీ లోని 51 దుకాణాలకు ఇప్పటి వరకు 547 అప్లికేషన్లు వచ్చాయి. మరో రోజు మిగిలి ఉండటంతో శని వారం పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.