calender_icon.png 18 October, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్మనెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా చొప్పదండి శ్రీనివాస్..

18-10-2025 02:08:24 PM

న్యాయమూర్తి ముకేష్ సన్మానo 

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సీనియర్ న్యాయవాది, చొప్పదండి శ్రీనివాస్ పర్మనెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమి తులయ్యారు. ఈ మేరకు ఆయన నియామక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో ఏజీపీ గా నియమితులైన చొప్పదండి శ్రీనివాసు ను బెల్లంపల్లి న్యాయమూర్తి జే ముఖేష్, సీనియర్ న్యాయవాదులు గోపి కిషన్ సింగ్ ఠాగూర్, ఎల్ రాము, చిప్ప మనోహర్,కే బాలకృష్ణ, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అంకం శివకుమార్ జనరల్ సెక్రెటరీ చేను రవికుమార్,న్యాయవాదులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి జే ముఖేష్ మాట్లాడుతూ ఏజీపీ గా నియమితులైన చొప్పదండి శ్రీనివాసు ను అభినందించారు. న్యాయవాద వృత్తిలో ఏజీపీ బాధ్యత  అనేది అత్యంత గురుతరమైనదనన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లో ఏజీపీ దీ కీలకమైన బాధ్యత నన్నారు. ప్రభుత్వం అప్పగించిన ఏజీపీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఏజీపీగా చొప్పదండి శ్రీనివాస్ నియామకం పట్ల పట్టణ ప్రముఖులు, బంధుమిత్రులు, స్నేహితులు హర్షం ప్రకటించారు.