18-10-2025 02:04:26 PM
హైదరాబాద్: తెలంగాణలో బంద్(Telangana Bandh) కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. హైదరాబాద్ బర్కత్ పుర డిపో ముందు బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. తెలంగాణ బీసీ బంద్ శాంతియుతంగా జరుగుతోందని ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) అన్నారు. 42 శాతం(BC reservations) రిజర్వేషన్ల కోసం బర్కత్ పురా బస్ డిపో(Barkatpura Bus Depot) ముందు ఆర్. కృష్ణయ్య ఆందోళన చేపట్టారు. బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తేల్చిచెప్పారు. కోర్టులు కూడా బీసీల వాదనలు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఉన్నత పోస్టుల్లో అందరూ రెడ్డి వర్గమే ఉంటుందన్నారు. ఎందుకు రెడ్డి జాగృతి కోర్టుకెళ్లి స్టే తెల్చిందని ఆయన ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బంద్ లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. బీసీలకు బీజేపీ వల్లే న్యాయం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు బీజేపీ వల్లే పదవులు దక్కాయన్నారు. మా హక్కుల కోసమే పోరాటం చేస్తున్నమన్నారు. తెలంగాణలో బీసీ వర్గాలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద జరిగిన రాష్ట్రవ్యాప్త బంద్‌లో బీసీ సంస్థలు, రాజకీయ పార్టీలతో కలిసి పాల్గొన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ పార్టీలు బంద్ కు మద్దతు తెలపడం అంటే హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తదన్నారు. రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని కవిత స్పష్టం చేశారు.