18-10-2025 02:11:06 PM
బిజెపి ద్వాంద వైఖరి విడనాడాలి.
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, బిజెపి ధ్వ0ద వైఖరి వీడాలి అని, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గంధసిరి అంబరీష, కొండం దశరథ, బానోతు రామ్ లాల్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అల్వాల వీరయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండ గాని వేణు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, శనివారం రోజున స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సెంటర్లో, రాస్తారోకో, బందు ధర్నా నిర్వహించారు, అనంతరం ఈ రాస్తారోకోను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో, బిజెపి వ్యవహరిస్తున్న విధానం బీసీలకు అనుకూలంగా లేదని విమర్శించారు.
ఒకవైపు రాష్ట్రంలో బీసీ బందుకు మద్దతు తెలుపుతూ, మరొకవైపు రిజర్వేషన్లను పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డుపడుతుందని బిజెపిని సూటిగా ప్రశ్నించారు, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ద్వంద విధానాన్ని విడనాడాలి, ఆల్రెడీ 3 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కి బిల్లు పంపింది, ఆయన గవర్నరు దాన్ని ఆమోదించలేదు, కేంద్రానికి బిల్లు పంపలేదు, తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన 8 మంది బిజెపి ఎంపీలు మాట్లాడకుండా, బీసీల మీద సావితి ప్రేమ వల్లకపోస్తూ, బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే 45% బీసీనీ పార్లమెంట్లో ఆమోదింప చేయాలి, లేనిపక్షంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని, ఒక మహా ఉద్యమం లాగా నడిపి బిజెపి ఆమోదింప చేసే వరకు ఉద్యమం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ షేక్ తాజుద్దీన్, గంధసిరి కృష్ణమూర్తి, సిపిఐ ఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్, బాణాల రాజన్న, బోడపాట్ల రాజశేఖర్, కందాల రమేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు యండి రషీద్,బీసీ సంగం మండల నాయకులు రాంపల్లి అబ్బయ్య దేవరశెట్టి లక్ష్మీనారాయణ, అక్కినపల్లి సాయికుమార్, గంధసిరి కృష్ణమూర్తి, గుండె గాని సుందర్, గుండ గాని నరేష్, వినయ్, సోమ గాని సాయి, గుండగాని రంగనాథ్, ఎండి సాదిక్, సిపిఐ యం యల్ న్యూ డెమోక్రసీ ఎడ్ల మల్లన్న,తదితరులు పాల్గొన్నారు.