18-10-2025 02:06:52 PM
రోడ్డుపై బైఠాయించిన అఖిలపక్ష నాయకులు
గుండాల, (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో బీసీ సంఘాల జేఏసీతో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఐ, సిపి ఎం పార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపుతామన్న సంగతి తెలిసిందే. శనివారం అఖిలపక్ష నాయకులు పాఠశాలలు, దుకాణాలు, ప్రభుత్వ ఆఫీసులను స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు.
అనంతరం మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో స్థానిక ఎస్ఐ తేజం రెడ్డి తన సిబ్బందితో వచ్చి శాంతిభద్రతల కు ఆటంకం కలుగుతుందని, బైఠాయించిన అఖిలపక్ష నాయకుల నిరసనను విరమింపజేశారు. కాంగ్రెస్ నాయకులు బిజెపిపై, టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్, బిజెపిలపై, సిపిఐ, సిపిఎం నాయకులు బిజెపి పార్టీలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రాకుండా అడ్డుకున్నారని చెప్పడం కోస మెరుపు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మండల నాయకులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు.