calender_icon.png 18 October, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీ కాల్వకు బీఎన్ రెడ్డి పేరు పెట్టాలి

17-10-2025 11:05:02 PM

పూలే, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈదురు వీరపాపయ్య 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): శ్రీరాంసాగర్ జలాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన మాజీ ఎంపీ భీంరెడ్డి నర్సింహారెడ్డి(బీఎన్ రెడ్డి) పేరును ఎస్సారెస్పీ ఫేస్-2కు పెట్టాలని పూలే,అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈదురు వీరపాపయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు తేవడమే తన జీవిత ఆశయంగా బీఎన్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.తక్షణమే ఎస్సారెస్పీ ఫేస్-2కు బీఎన్ రెడ్డిగా నామకరణం చేయాలని అన్నారు.