18-10-2025 02:13:28 PM
వైన్స్ టెండర్ చివరి తేదీ కావడంతో అయోమయం
బ్యాంకులను బంద్ చేయించిన నిరసన కారులు
మహబూబ్ నగర్(విజయక్రాంతి): మద్యం షాపులను దక్కించుకునేందుకు టెండర్లు దాఖలు చేసేందుకు శనివారం చివరి తేదీని ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే. బ్యాంకులలో చాలానా కట్టి సంబంధిత డిడిని టెండర్ లో వేయవలసి ఉంటుంది. శనివారం బిసి(BC Bandh effect) రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ పార్టీల తో పాటు బీసీ కామ ప్రజాసంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. బ్యాంకులను సైతం కొన్ని ప్రాంతాల్లో నిరసన కారులు మూసి వేయించడంతో టెండర్లు దాఖలు చేసే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరిన్ని రోజులు గడువు పెంచుతారా ఇదే చివరి తేదీ అంటూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ బ్యాంకులో తెరిచారు అని ఆరా తీస్తూ చలనాలను లు చెల్లించేందుకు ఆసక్తి కనబరచుతుండ్రు.