10-09-2025 08:04:29 PM
ఆర్డీఓ వేణుమాధవరావు..
తహాశీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..
నూతనంగా నియమితులైన జీపీఓలకు పలు సూచనలు..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మండలంలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిచేయాలని ఆర్డీఓ వేణుమాధవరావు(RDO Venu Madhava Rao) ఆదేశించారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని తహాశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల ఫార్మాట్లు, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులతో పాటు పలు రకాల ఫిర్యాదుల గురించి కార్యాలయ సిబ్బందికి, నూతనంగా నియమితులైన జీపీఓలకు పలు సూచనలు చేశారు. నూతన రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హత కలిగిన వారికే కార్డు వచ్చేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ బాషపాక శ్రీకాంత్, గిర్ధవార్లు జలంధర్ రావు, వెంకట్ రెడ్డి, నూతన జీపీఓలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.