calender_icon.png 10 September, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరుకోడు గ్రామపంచాయతీని సందర్శించిన ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల బృందం

10-09-2025 08:00:56 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు గ్రామపంచాయతీ 2023-24 సంవత్సరానికి ఉత్తమ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీగా ఎంపిక కావడంతో అవగాహన కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 30 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు సిఆర్డి నుండి సిఈవో శ్రీ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఎక్స్ప్లోర్ విజిట్ కై ఈరోజు గ్రామపంచాయతీని సందర్శించారు. వారు గ్రామపంచాయతీలో మహిళా సహకార అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎస్‌ఎస్‌జీ గ్రూప్ సభ్యులతో చర్చించారు. మహిళల స్వయం ఉపాధి పచ్చళ్ళ యూనిట్, మహిళ సాధికారక కార్యక్రమాలు, గ్రామంలోని ఆరోగ్య సదుపాయాలు, ప్రసూతి వివరాలు, పాఠశాలలో మోడల్ స్కూల్ కుట్టుశిక్షణా కేంద్రం పనితీరును సమీక్షించారు. 

విద్యార్థుల యూనిఫాంల తయారీ, మహిళలకు అందుతున్న శిక్షణా కార్యక్రమాలను దగ్గరగా పరిశీలించి గ్రామంలో ఎలాంటి మహిళా వివక్ష లేకుండా సదుపాయాలు అందుతున్న తీరు వారిని ఆకట్టుకుంది. ఇరుకోడు గ్రామపంచాయతీ చేపడుతున్న అభివృద్ధి చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. మురళీధర శర్మ, డీఎల్పీవో మల్లికార్జున్ రెడ్డి, ఎంపీ ఓ విష్ణువర్ధన్, ఏపీవో కిషన్, ఏపీఎం ధర్మసాగర్, గ్రామపంచాయతీ కార్యదర్శి జీవన్ రెడ్డి, మహమ్మద్ గౌస్, బోయిని యాదగిరి, రాజ్‌కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ మధుసూదన్, ఐసిడిఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, వైద్యాధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళా ఎస్‌ఎస్‌జీ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.