10-09-2025 08:06:51 PM
ఎంఈఓ బాలునాయక్
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల విద్యాధికారి బి బాలునాయక్(Mandal Education Officer Balu Naik) కోరారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయులకు, వీఓఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యత, ప్రాథమిక విద్య ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైందని, 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి చదవటం, రాయడం వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. గ్రామాల్లోని మహిళలు,మధ్యలో బడి మానేసిన వారు, దివ్యాంగులకు చదవడం రాయడంతో పాటు ఆర్థిక, డిజిటల్, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి వాటిపై నైపుణ్యాలను నేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి,కాంప్లెక్స్ హెచ్ఎం కుంభం ప్రభాకర్,పీఎస్ హెచ్ఎం చంద్రారెడ్డి,ఆర్పీలు సీహెచ్ నాగరాజు,వి సైదులు,వీఓఏలు దేవరకొండ విజయ,బూర్గుల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.