calender_icon.png 10 January, 2026 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 30లోపు ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు సమర్పించాలి: కలెక్టర్

10-01-2026 12:43:44 AM

రఘనాథపాలెo/ఖమ్మం, జనవరి -9(విజయక్రాంతి): ఖమ్మం ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో  రెసిడెన్షియల్ పద్ధతిలో 5 నెలల పాటు ఉచిత శిక్షణ అందించే ఫౌండేషనల్ కోర్సు ప్రవేశ పరీక్షకు ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిటీ, బ్యాంకింగ్ మొదలైన వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి భోజన వసతితో కూడిన 5 నెలల బేసిక్ ఫౌండేషన్ కోర్సును అర్హులైన 100 మంది అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 

ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు, మైనారిటీ లకు కలిపి 15 శాతం, ఓవరాల్ మహిళలకు 33.3 శాతం, దివ్యాంగులకు ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ పాటించడం జరుగుతుందని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలని, అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని అన్నారు.  అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్షకు http://tsstudycircle.co.in  వెబ్ సైట్ లో జనవరి 30 లోపు దరఖాస్తులు సమర్పించా లని, ఫిబ్రవరి 8న  ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందనారు. ఇతర వివరాలకు 9866726277, 7981988667 నెంబర్ నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.