calender_icon.png 11 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

10-01-2026 12:45:02 AM

పాల్వంచ,  జనవరి 9 (విజయక్రాంతి) : కుమారులు లేకపోవడంతో ఇంటికి పెద్ద  కూతురే అన్నీ తానై తండ్రి చనిపోతే తలకొరివి పెట్టి తండ్రి రుణాన్ని తీర్చుకుంది. ఈ విషాద సంఘటన పాల్వంచ పట్టణంలోని వడ్డుగూడెంలో (గొల్లగూడెం ) శుక్రవారం చోటుచేసుకుంది. సంబంధించి వివరాల ప్రకారం... వడ్డుగూడెం లో నివసిస్తున్న ముదిగొండ కోటేశ్వరరావు అనే వ్యక్తి  చండ్రుగొండ మండలం  మద్దుకూరు లో వెటర్నరీ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. 

అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు.. మృతునికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు నవ్య, చిన్న కూతురు అస్మిత లు ఉన్నారు. పెద్ద కూతురు కెనడాలో భర్తతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తుండగా తండ్రి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే బయలుదేరి శుక్రవారం ఉదయం పాల్వంచలో నీ తండ్రి  ఇంటికి చేరుకుంది. మృతునికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కుమార్తె  నవ్య   తండ్రికి తలకొరివిపెట్టి కన్నతండ్రి రుణాన్ని తీర్చుకుంది. ఈ సంఘటనను చూసిన బంధువులు, మిత్రులు, అతని కొలీగ్స్, శ్రేయోభిలాషులంతాకన్నీటి పర్యంతం అయ్యారు.