10-01-2026 12:42:07 AM
డీఎంహెచ్‌వో తుకారం
కొత్తగూడెం, జనవరి 9 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుష్టువ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వే నెల 18 నుంచి 31 వరక సర్వే నిర్వహించామని, ఈ కార్యక్రమంలో 1,708 మంది కుష్ఠు అనుమానితులుగా గుర్తించడం జరిగిందనీ పిల్ల వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ తెలిపారు. వీరిని ఈ నెల నుండి 1 వ తేది నుండి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఉన్న వైద్యులు ,ఉప కేంద్రాలలో డీపీఎంఓలు కుష్టు అనుమానితులను పరీక్షించి , నిర్ధారణ ఇస్తారన్నారు . ఇప్పటివరకు 1,013 మందిని పరీక్షించి 22 మందిని కుష్టు వ్యాది గ్రస్తులు గా నిర్దారించి , మందులు యివ్వడం జరిగిందన్నారు.
వచ్చినటు వంటి అనుమానిత కేసులలో కొమరారం, గుండాల , రొంపేడు చండ్రుగొండ, ఏర్రగుంట ఆరోగ్య కేంద్రాల పరిదిలోbకేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. గత నెల చివరి వరకు జిల్లాలో కుష్టు వ్యాధి మందులు వాడే వారి సంఖ్య 52 మంది , యిందులో 45 ఎంబి కేసులుగా 7 పి బి వ్యాధిగ్రస్తులు గా, మందులు వాడుతున్నారు. కొత్తగూడెం డివిజన్ పరిధిలో 37 మంది , భద్రాచలం డివిజన్ పరిధిలో 15 మంది వ్యాధికి చికిత్స నిమిత్తం మందులు వాడుతున్నారు.
ఈ సందర్భంగా తుకారం రాథోడ్ మాట్లాడుతూ, మిగిలిన అనుమానిత వ్యక్తులను ,త్వరలో నిర్థారించి మందులు అందజేస్తామని తెలియచేసారు. సమసమాజంలో ఎవరికైనా శరీరంపై రాగి వర్ణంలో లేదా పాలిపోయిన మచ్చలు ఉండి, తిమ్మిరిగా, గిచ్చిన నొప్పి లేవకుండా ఉన్నటువంటి మచ్చలుగా గుర్తించినట్లయితే, తక్షణమే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి, అది కుష్టు వ్యాధియా కాదా అని నిర్ధారించుకోవాలని తెలియజేశారు. వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించి మందులు వాడినట్లయితే ,వ్యాధిని పూర్తిగా నివారించవచ్చును.
అంగవైకల్యాలకు దారి తీయకుండా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అనంతరం సమాజంలో ఇంకా కుష్టు వ్యాధిపై అనుమానాలు అపోహలు కలంకాలు ఉన్నాయి కాబట్టి , వ్యాధి సోకిన వారు ఇంకా గోప్యంగా ఉండి సమాజంలో వ్యాధిని వ్యాపింప చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. బి.పుల్లా రెడ్డి, పిజియోతెరపిస్టు జి. భద్రు మరియు మోహన్ డి.పి.యం ఓ లు పాల్గొన్నారు.