18 April, 2026 | 8:20 AM

ప్రజవాణిలో 111 దరఖాస్తులు

10-06-2025 12:33 AM

స్వీకరించిన సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు

సంగారెడ్డి, మెదక్, జూన్ 9(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు క్రాంతి వల్లూరు, రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో 61 ఫిర్యాదులు అందాయి.

వీటిలో రెవెన్యూ 15, సివిల్ సప్లై 4, సర్వే ల్యాండ్ 5, పంచాయతీరాజ్ 8, పెన్షన్స్ 7, మున్సిపల్ 4 , విద్యాశాఖ 2, మత్స్యశాఖ 5, వైద్య, ఆరోగ్యంపై 2, ఇతర సమస్యలపై 9 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ లతో పాటు డీఆర్వో పద్మజరాణి ఫిర్యాదులను స్వీకరించారు. 

మెదక్ జిల్లాలో 50 దరఖాస్తులు...

మెదక్ జిల్లాలో ప్రజావాణికి 50 దరఖాస్తులు అందాయి. వీటిలో ధరణి 23, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు -02, రుణమాఫీ 2, ఇతర సమస్యలపై 23 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, కలెక్టరేట్ విభాగాల అధికారులుపాల్గొన్నారు.