15-05-2025 12:57:32 AM
ప్రవేశాల పోస్టర్ను ఆవిష్కరణ
గద్వాల, మే 14 ( విజయక్రాంతి ) : జిల్లాలోని మైనార్టీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తెలిపారు. బుధ వారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందు తెలంగాణ మైనార్టీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులను ఆహ్వానిస్తూ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ మైనార్టీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో 2025- 2026 విద్యాసంవత్సరానికి 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థుల నుండి టీజీఎంఆర్‌ఇఐఎస్ అధికార వ్బుసైట్ tgmreistelangana.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ప్రవేశాల వివరాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 7207998985 లేదా 7331170829 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.
విద్యార్థులకు సన్మానం ..
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు నిషా పార్విన్ (989 ఎం పీసీ ),ముస్కాన్ బేగం (994 బైపీసీ రాష్ట్ర 4వ ర్యాంకు), జనీరా తబస్సుం, అల్ఫియా, చాంద్ బీలు ఉత్తమ ఫలితాలు సాధించడాన్ని జిల్లా కలెక్టర్ అభినందించి,
ఈ విజయాలు మైనారిటీ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్ బాబు, ప్రిన్సిపాల్ పార్వతి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.