15-05-2025 08:06:57 PM
భద్రచలంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆఫీసులో కరపత్రాలు ఆవిష్కరణ...
భద్రాచలం (విజయక్రాంతి): కార్మికుల హక్కులు హరించే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మే 20న జరిగే దేశవ్యాపిత కార్మిక సమ్మెను, గ్రామీణ బందును జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం భద్రాచలం అశోక్ నగర్ కాలనీ లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యలయంలో రంగారెడ్డి సమ్మె కరపత్రాలను పలువురితో కలిసి ఆవిష్కరించారు.
ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేసి కార్పోరేట్ కంపెనీలకు అనుకూలమైన 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని విమర్శించారు. ఇట్టి కార్మిక విదానాలను విడనాడాలని, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకురాలు కెచ్చెల కల్పన, డివిజన్ నాయకులు సాయన్న, శివ మహిళా సంఘం నాయకులు శాంతక్క, కుమారి, రమాదేవి, షకీరా, నసీమా, లక్ష్మి, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.