calender_icon.png 16 May, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు వాటర్ బాటిళ్ల వితరణ..

15-05-2025 09:36:34 PM

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం వడ్డేపల్లి చర్చి జంక్షన్ ప్రాంతంలోని ఓయాసిస్ ఆశ్రమంలో గురువారం జరిగాయి. తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యుటివ్ మెంబర్ మండల సమ్మయ్య సమకూర్చన కేక్ కట్ చేసి ఆశ్రమంలోని పిల్లలకు వాటర్ బాటిళ్లు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మండల సమయ్య, 58వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్, జిల్లా నాయకులు కేతిడి దీపక్ రెడ్డి, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి విజయ్, జనగం శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి  మేరీ, మహమ్మద్ సాజిద్, కమల్ తదితరులు పాల్గొన్నారు.