15-05-2025 08:54:21 PM
సిఐ కరుణాకర్..
హుజురాబాద్ (విజయక్రాంతి): చదువుతో పాటు పిల్లలకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్(Town CI Karunakar) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శాస్త్ర పబ్లిక్ స్కూల్లో గురువారం బాక్స్ క్రికెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు శాస్త్ర స్కూల్లో బాక్స్ క్రికెట్ ని విద్యార్థినీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. శారీర దృఢత్వానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, బాక్స్ క్రికెట్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.