18 April, 2026 | 3:31 PM

శ్రమ శక్తి అవార్డు గ్రహీత శ్రీకాంత్ కు సన్మానం

15-05-2025 08:48 PM

వరంగల్ (విజయక్రాంతి): కార్మికులకు ఏడాదికి 10 వేల చొప్పున వరసగా మూడేళ్లుగా లేబర్ కార్డులు ఇప్పిస్తూ, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఇటీవల శ్రమశక్తి అవార్డు అందుకున్న వరంగల్ నగరానికి చెందిన బిల్లా శ్రీకాంత్ ను డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శ్రీకాంత్ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు చేస్తున్న కృషిని అభినందించారు.