15-05-2025 08:18:19 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లో ప్రధాన రహదారులపై పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇటీవల గోవుల అక్రమ రవాణా పెరిగిపోయిందని వస్తున్న ఫిర్యాదుల మేరకు జిల్లా పోలీసులు జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా వాహనాలను తనిఖీ చేసి వదిలిపెడుతున్నారు. గురువారం కంబాలపల్లి పరిధిలో మరో చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ సదవయ్య ఎస్సై దీపిక ప్రొఫెషనరీ ఎస్సై నరేష్ హెడ్ కానిస్టేబుల్ వీరన్న, కానిస్టేబుళ్లు విజయ్, బాలరాజు, సోమమల్లు, సురేష్ పాల్గొన్నారు.