calender_icon.png 16 May, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో గోదావరి, కృష్ణా పుష్కరాలు: సీఎం రేవంత్

15-05-2025 08:40:47 PM

కాళేశ్వరం: కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాల్లో(Saraswati Pushkaralu) భాగంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హారతి కార్యక్రమంలో మాట్లాడుతూ... తోలిసారిగా భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా రానున్నాయని సీఎం పేర్కొన్నారు. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పించామన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించే అదృష్టం నాకు కలగనుందని, కాళేశ్వరం క్షేత్రాన్ని గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. దేశం నలుమూలల నుంచి కాళేశ్వరం క్షేత్రానికి  వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని, కాళేశ్వరం అభివృద్ది కోసం రూ.200 కోట్లు అయినా కేటాయించేందుకు సిద్దామని సీఎం పేర్కొన్నారు.