calender_icon.png 16 May, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్కర భక్తులకు అన్నదానం

15-05-2025 08:58:22 PM

భూపాలపల్లి (విజయక్రాంతి): సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం భూపాలపల్లి జిల్లా కమలాపూర్ క్రాస్ రోడ్డులో హైదరాబాద్ సోలిస్ ఐ కేర్ హాస్పిటల్(Solis Eye Care Hospital) దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) ప్రారంభించారు. ఈనెల 26 వరకు ప్రతిరోజు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం గుండా పుష్కరాలకు వెళ్లే భక్తులు అన్నదాన శిబిరంలో భోజనం చేసి వెళ్లాలని కోరారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు.