15-05-2025 12:59:17 AM
గద్వాల, మే 14 (విజయక్రాంతి) : గద్వాల ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ మరియు గౌరవ వేతనం కింద పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 10 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 19 సీనియర్ రెసిడెంట్లు, 05 ట్యూటర్ పోస్టులకు ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్టు పద్ధతిలో, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు గౌరవ వేతనం క్రింద పనిచేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈనెల 28వ తేదీన వాక్ - ఇన్ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలని తెలిపారు. పూర్తి వివరాలకు https://gadwal.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.