calender_icon.png 15 May, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం

15-05-2025 08:02:57 PM

ఎమ్మెల్యే మురళి నాయక్...

మహబూబాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తోందని, పేదల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలం రాములు తండాలో విద్యుదాఘాతంతో మరణించిన నునావత్ వినోద కుటుంబానికి విద్యుత్ శాఖ తరపున మంజూరైన ఐదు లక్షల రూపాయల పరిహారం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తుందని పేర్కొన్నారు. వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డివిజన్ ఇంజనీర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.