calender_icon.png 15 October, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ డైలీవేజ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించండి

14-10-2025 10:08:11 PM

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాదాస్ అఖిల్..

మణుగూరు (విజయక్రాంతి): గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హాస్టల్ డైలీవేజ్ వర్కర్స్ సమస్యల పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాదాస్ అఖిల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన డైలీవేజ్ వర్కర్స్ నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, హాస్టల్ డైలీవేజ్ వర్కర్లు నెలలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సంవత్సరాలుగా పనిచేస్తున్న వర్కర్లకు పర్మినెంట్ చేయకపోవడం, జీతాలు ఆలస్యంగా చెల్లించక పోవడం దారుణమన్నారు.

కనీస వేతనాలు సైతం సరైన సమయానికి అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉన్నామని చెబుతూ ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు. డైలీవేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులను ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన విద్యార్థులతో కలిసి ఐటిడిఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, ప్రేమ్, కిరణ్, మోహన్, సాయి, తరుణ్, చరణ్, కౌశిక్, రోహిత్ పాల్గొన్నారు.