calender_icon.png 7 October, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరుకు సైసై

07-10-2025 03:55:12 PM

ఆశావహుల ఆశలు ఫలించేనా.... పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం 

అధికార, ప్రతిపక్ష పార్టీలకు దరఖాస్తుల వెలువ

హైకోర్టు తీర్పైనే ఉత్కంఠ

నకిరేకల్,(విజయక్రాంతి): ఎప్పుడు వస్తాయని వేచి చుసిన స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలైంది. గురువారం హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోందన్న ఆందోళన రాజకీయ నాయకుల్లో, ఆశావహుల్లో  మొదలైంది. కొంతమందికి రిజర్వేషన్లు అనుకూలిస్తే మరి కొంత మందికి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో రాజకీయ రణరంగం మొదలైంది.

అధికార ప్రతిపక్ష పార్టీలకు దరఖాస్తుల విలువ మొదలైంది. ఒక ఎంపీటీసీ, జడ్పిటిసి  పదవికి సుమారు పదిమంది ఆశావహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలలో టికెట్ ఎవరికీ వస్తుందోఅని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఎవరికివారు ప్రయత్నాలు, పైరవి లు మొదలుపెట్టారు. విడి,విడిగా గ్రామాలలో గుంపులు గుంపులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కులాల వారిగా మతాల వారీగా పార్టీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం మొదలయ్యాయి. నేను పోటీలో ఉన్నానని సంకేతాలు ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు.

ఆశాహహులుఖర్చు చేయడం మొదలుపెట్టారు.నేనున్నానంటే నేనున్నానంటూ పోటీ పడుతూ చాప కింద నీరులగా ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టారు. దరఖాస్తులతో అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒక తలనొప్పి లాగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే మిగతావారని ఎలా బుజ్జగించాలో తెలియని పరిస్థితి. బుజ్జగింపులకు ఒప్పుకుంటారా లేక వ్యతిరేకంగా పనిచేస్తారా తెలియని ఆందోళన మొదలైంది. కొంతమంది టికెట్ దక్కపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ స్థానిక సంస్థల్లో ఏం జరగబోతుందో అని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం సర్పంచి, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారుయ్యాయి. నకిరేకల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు 12, సర్పంచి, ఎంపీటీసీ స్థానాలు 201 ఉన్నాయి. వీటిలో మొత్తం మహిళలకు 78 స్థానాలను రిజర్వు చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో ఐదు, సర్పంచి, ఎంపీటీసీ స్థానాల్లో 73 మహిళలకు దక్కాయి.

 మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు.. 

నకిరేకల్ మండలం 09స్థానాల్లో 04 స్థానాలను మహిళలకు రిజర్వ్ కేటాయించారు. ఎస్సీ-02, బీసీ-04, జనరల్-03 స్థానాలు ఉన్నాయి.

కేతపల్లి మండలం 11 స్థానాల్లో 04 స్థానాలను మహిళలకు రిజర్వ్ కేటాయించారు ఎస్సీ- 03, బీసీ-05 ,జనరల్-03 స్థానాలు ఉన్నాయి.

కట్టంగూర్ మండలం 13 స్థానాల్లో 06 స్థానాలనుమహిళ లకు రిజర్వ్ కేటాయించారు. ఎస్సీ-03, బిసి-06, జనరల్-0 4 స్థానాలు ఉన్నాయి.

నార్కట్ పల్లి మండలం 15 స్థానాల్లో 07 స్థానాలనుమహిళలకు రిజర్వ్ కేటాయించారు ఎస్సీ- 03,బీసీ-06, జనరల్- 06 స్థానాలు ఉన్నాయి. 

చిట్యాల మండలం 12 స్థానాలకు 05 స్థానాలను మహిళలకురిజర్వ్ కేటాయించారు.ఎస్సి-03, బిసి- 06, జనరల్ -06 స్థానాలు ఉన్నాయి. 

రామన్నపేట మండలం 15 స్థానాలకు 03 మహిళా స్థానాలను రిజర్వ్ కేటాయించారు. ఎస్సీ-03 ,బీసీ-06, జనరల్ -06 స్థానాలు ఉన్నాయి

 సర్పంచి స్థానాల రిజర్వేషన్లు  

నకిరేకల్ మండలం 17 స్థానాల్లో 08 స్థానాలను మహిళలకు రిజర్వ్ కేటాయించారు. ఎస్సీ-04, బీసీ-03, జనరల్-10 స్థానాలు ఉన్నాయి.

కేతపల్లి మండలం 16 స్థానాల్లో 07 స్థానాలను మహిళలకు రిజర్వ్ కేటాయించారు ఎస్సీ- 04, బీసీ-07, జనరల్-05, స్థానాలు ఉన్నాయి.

కట్టంగూర్ మండలం 22 స్థానాల్లో 10 స్థానాలను మహిళలకు రిజర్వ్ కేటాయించారు. ఎస్సీ-05, బిసి-09, జనరల్-0 8 స్థానాలు ఉన్నాయి.

నార్కట్ పల్లి మండలం 29 స్థానాల్లో 14 స్థానాలను మహిళలకు రిజర్వ్ కేటాయించారు ఎస్సీ- 07,బీసీ-12, జనరల్- 10స్థానాలు ఉన్నాయి. 

చిట్యాల మండలం 18 స్థానాలకు 08 స్థానాలను మహిళలకురిజర్వ్ కేటాయించారు.ఎస్సి-03, బిసి- 08, జనరల్ -07 స్థానాలు ఉన్నాయి. 

రామన్నపేట మండలం 24 స్థానాలకు 08 మహిళా స్థానాలను రిజర్వ్ కేటాయించారు. ఎస్సీ-05 ,బీసీ-10, జనరల్ -09 స్థానాలు ఉన్నాయి.

నియోజకవర్గంలో సర్పంచి స్థానాలు 126 ఉండగా మహిళలకు 39, బీసీలకు 49, ఎస్సీలకు 28, జనరల్ కేటగిరిలో 49 స్థానాలు రిజర్వు చేశారు.

ఎంపీటీసీ స్థానాలు 75 గాను 34 మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు 16, బీసీలకు 32, జనరల్ కేటగిరిలో 27 స్థానాలకు రిజర్వు చేశారు. రిజర్వేషన్లు మారడంతో ఇంతకాలం ఆయా పదవులపై గంపెడాశలు పెట్టుకున్న నాయకులు నిరాశకు గురయ్యారు. రిజర్వేషన్ల ద్వారా కొత్త వారికి అవకాశాలు వస్తుండటంతో వారిలో ఆశలు పెరిగాయి. ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వనున్నరో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.