calender_icon.png 7 October, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు టీ షర్టుల వితరణ

07-10-2025 03:32:01 PM

కాటారం,(విజయక్రాంతి): క్రీడాకారులలో ఉన్న స్ఫూర్తిని వెలికి తీసే ఉద్దేశంతో వారికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ నాయకుడు భూపెల్లి రాజు క్రీడా దుస్తులను వితరణ చేశారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో జరుగుతున్న డీపీఎల్ వన్ క్రికెట్ క్రీడాకారులకు టీ-షర్టులతో పాటు మొదటి, ద్వితీయ విజేతలకు షీల్డ్ లను బహూకరించనున్నట్లు భూపెల్లి రాజు వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రాజును పలువురు ప్రశంసించారు.