calender_icon.png 7 October, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాల్మీకి చరిత్ర చిరస్మరణీయం..

07-10-2025 04:21:11 PM

తహశీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ గోపి.. 

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ గోపీ అన్నారు. మండల కేంద్రం అర్వపల్లిలోని ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాల్లో మంగళవారం ఆదికవి వాల్మీకీ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తన గురువు బోధనల ద్వారా ప్రేరణ పొంది, పశ్చాత్తాపంతో సద్గుణ మార్గం వైపు మల్లి, ఆత్మ శోధన ద్వారా మహానుభావుడిగా మారి మనందరికీ ఆదర్శప్రాయమైన రామాయణం అనే గ్రంధాన్ని రచించాడన్నారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో గిర్ధవార్లు జలంధర్ రావు, వెంకట్ రెడ్డి, ప్రసన్న, సూపరిండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ నరసింహారాజు, జూనియర్ అసిస్టెంట్ శిల్పిక, సాయిప్రదీప్, టీఏలతో పాటు ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.