calender_icon.png 7 October, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ జెండా ఎగరేస్తాం

07-10-2025 03:46:15 PM

బీఎస్పీ  జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్

మందమర్రి,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని మండలాల్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఎస్పీ జండాను ఎగుర వేస్తామని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచేందుకు బిఎస్పీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. బీసీ వాదానికి నిలువెత్తు రూపం బహుజన్ సమాజ్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో పాటు అత్యధిక ఎంపీపీలను  కైవసం చేసు కుంటామని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామనీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న బహుజనులందరు బీఎస్పీ ఏనుగు గుర్తును ఆశీర్వదించాలని కోరారు. మహనీయుల ఆశయాలే తమకు ప్రేరణ అని, దివంగత కాన్షీరామ్ ఆశయాలను సాకారం చేసేది  బిఎస్పీ పార్టీ అని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రతి నిత్యం ప్రజల మధ్యలో ఉంటామన్నారు.