calender_icon.png 7 October, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరపలకలో వాల్మీకి జయంతి వేడుకలు

07-10-2025 03:59:33 PM

ముకరంపుర,(విజయాక్రాంతి): ధర్మం, సత్యం, ఆదర్శ విలువలను బోధించిన రుషి వాల్మీకి మహర్షి అని కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రోజు సంస్కృత, సాహిత్యంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ మహారుషి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ఆయన చిత్ర పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ... సంస్కృతం, సాహిత్యం ఆదికవిగా పిలువబడే మహారుషి వాల్మీకి జయంతి వేడుకలు కార్యాలయంలో నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు. రామాయణ మహాకావ్యం రచించి ప్రపంచానికి ధర్మం, న్యాయం, సత్యం, సేవా మార్గాలను చూపించిన గొప్ప మహనీయులని అన్నారు. ప్రతి ఒక్కరికి వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.